మత్స్యకారుల సంబరాలను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు: ఎంపీ విజయసాయి రెడ్డి
- పాక్ జైలు నుంచి వారి విడుదలకు సీఎం జగన్ కృషి చేశారు
- మత్స్యకారులు సొంతూర్లకు వెళ్లి సంబరాల్లో ఉన్నారు
- జగన్ కు మంచి పేరు వస్తుందనే చంద్రబాబు విమర్శిస్తున్నారు
‘పాకిస్థాన్ చెరలో 14 నెలల పాటు నరకాన్ని అనుభవించిన మత్స్యకారులు సీఎం జగన్ గారి చొరవతో విడుదలయ్యారు. సొంత ఊళ్లకు చేరి సంబరాలు జరుపుకుంటుంటే చంద్రబాబునాయుడు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. సీఎం జగన్ కు ఎక్కడ మంచి పేరు వస్తుందో అని దాడులు, అరాచకాలు మొదలు పెట్టారు’ అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.