తగ్గని ఇరాన్... బాగ్దాద్ గ్రీన్ జోన్ ను తాకిన రెండు రాకెట్లు!
- 24 గంటల వ్యవధిలో రెండో దాడి
- భారీ శబ్దాలతో దద్దరిల్లిన గ్రీన్ జోన్
- ఇరాక్ లో తీవ్ర ఆందోళన
గ్రీన్ జోన్ లో భారీ శబ్దాలు వినిపించాయని, ఇరాక్ లోని సంకీర్ణ దళాల సైనిక స్థావరాలపై మిసైల్ దాడులు జరిగిన 24 గంటల తరువాత తాజా దాడి జరిగిందని పేర్కొంది. తాజా దాడులు కూడా సులేమానీ హత్యకు ప్రతీకారంగా జరిగినవేనని సమాచారం. ఈ ఘటనతో ఇరాక్ లోని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.