తిరుమలలో కనిపించని రద్దీ... ఒకే కంపార్టుమెంట్ లో భక్తులు!
- 2 నుంచి 3 గంటల్లోనే దర్శనం
- ధనుర్మాసం కారణంగా అధ్యయనోత్సవాలు
- రేపు పౌర్ణమి గరుడ సేవ రద్దు
ఇదిలావుండగా, ధనుర్మాసం కారణంగా ఆలయంలో అధ్యయనోత్సవాలు జరుగుతూ ఉండగా, రేపు జరగాల్సిన పౌర్ణమి గరుడ సేవను రద్దు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 65 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. దాదాపు రూ. 3 కోట్ల మేరకు హుండీ ఆదాయం లభించింది. సంక్రాంతి సెలవులు ముగిసేంత వరకూ రద్దీ సాధారణ స్థాయిలోనే ఉండవచ్చని భావిస్తున్నట్టు టీటీడీ అధికారులు వ్యాఖ్యానించారు.