మాంచెస్టర్ లోని పాశవిక రేపిస్ట్ కు 30 ఏళ్ల జైలు శిక్ష!
- మాంచెస్టర్లో 195 మందిపై అత్యాచారాలు
- 48 మంది యువకులపై పాల్పడ్డ నేరాలు నిరూపితం
- మాటలతో ప్రలోభపెట్టి..డ్రగ్స్ ఇచ్చి రేప్
అతని స్నేహితులు చెప్పిన వివరాల ప్రకారం, రేన్హార్డ్ మంచి మాటకారి.. ఎదుటి వ్యక్తులను తన మాటలతో బోల్తా కొట్టించేవాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మాంచెస్టర్ క్లబ్బుల్లో పలువురు యువకులను ఆకట్టుకొని తన ఫ్లాట్ కు తీసుకునిపోయి వారికి డ్రగ్స్ ఇచ్చి వారిపై అత్యాచారం జరిపేవాడని కోర్టులో నిరూపితమైంది. కోర్టులో అతని తరపు న్యాయవాది రేన్హార్డ్ తో ఇతరులు లైంగిక సంబంధాలను ఇష్ట పూర్వంకగా పెట్టుకునేవారన్నప్పటికీ.. జడ్జి ఆ వాదనను తిరస్కరించారు.
కాగా తన కుమారుడికి వేసిన శిక్షను అతని తండ్రి సాయ్ బున్ సినాగా సమర్థించాడు. ‘మేము అతనికి విధించిన శిక్షను ఒప్పుకుంటున్నాం. అతను చేసిన నేరాలకు ఆ శిక్ష పడాల్సిందే. ఈ కేసుకు సంబంధించి ఇంకా చర్చించదలుచుకోలేదు’ అని అని అన్నారు.