బ్రేకింగ్... ఇరాక్ లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు!
- సులేమాని మృతిపై రగిలిపోతున్న ఇరాన్
- ఇరాక్ లక్ష్యంగా దాడులు
- ఎయిర్ బేస్ లను తాకిన 12 క్షిపణులు
- పరిస్థితిని సమీక్షిస్తున్న ట్రంప్
ఇరాక్ లోని అల్ అసద్, ఇర్బిల్ ఎయిర్ బేస్ లను డజనుకు పైగా క్షిపణులు ఇరాన్ నుంచి వచ్చి తాకినట్టు తెలుస్తోంది. పశ్చిమాసియా నుంచి తన బలగాలను వెనక్కు తీసుకోవాలని అమెరికాను ఇరాన్ హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ దాడికి తెగబడటంతో, వైట్ హౌస్ అధికారులతో తాజా పరిస్థితులను సమీక్షిస్తున్న ట్రంప్, ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆందోళన నెలకొంది.