నిర్భయ దోషుల ఉరితీతకు బీహార్ నుంచి తాళ్లు
- మీరట్ నుంచి తలారీ రాక?
- తీహార్ జైల్లో ఉరితీతకు ఏర్పాట్లు
- అప్జల్ గురు ఉరితీతకు వాడినది బీహార్ తాడే
దోషులు నలుగురిని జైల్లో ఒక్కో సెల్ లో ఉంచి వారిని సీసీ టీవీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఉరిశిక్ష అమలుకు కావాల్సిన ప్రత్యేకమైన తాళ్లను బీహార్ లోని బక్సర్ జైలు నుంచి తెప్పించినట్లు సమాచారం. పార్లమెంట్ పై దాడి కేసులో ఉరిశిక్ష పడిన అఫ్జల్ గురును ఉరితీసేందుకు ఈ జైలు నుంచి తీసుకొచ్చిన తాడునే ఉపయోగించిన విషయం తెలిసిందే.