హైపవర్ కమిటీలో రాజధాని కట్టినోడు ఒక్కడున్నాడా?: నారా లోకేశ్
- ఏముంది హైపవర్ కమిటీలో?
- ఇటుకేసినోడు ఒక్కడున్నాడా?
- జీఎన్ రావు కమిటీ .. వాళ్ల జీవితంలో రాజధాని కట్టారా?
ఈ విషయమై లోకేశ్ ను మీడియా ప్రశ్నించగా.. ‘ఏముంది హైపవర్ కమిటీలో? రాజధాని కట్టినోడు ఒకడున్నాడా దాంట్లో? ఇటుకేసినోడు ఒక్కడున్నాడా? జీఎన్ రావు కమిటీ అన్నారు!.. వాళ్ల జీవితంలో రాజధాని కట్టారా? బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అన్నారు! ఆ మనుషులు ఎవరో తెలియదు?’ అని విమర్శించారు. బోస్టన్ కన్సల్టింగ్ సంస్థకు జీవో ఎప్పుడిచ్చారో, అసలు, ఆ సంస్థకే ఎందుకిచ్చారో, వాళ్లకు ఏం అనుభవం ఉందో ఎవరికీ తెలియదు? అని, ఆ కమిటీ గ్రామాల్లో ఎప్పుడూ పర్యటించలేదని తీవ్రంగా విమర్శించారు.