రాజధాని అమరావతిలోనే ఉంటుందని రుణాలతో ఫ్లాట్లూ కొనుగోలు చేశాం: సచివాలయ ఉద్యోగులు

  • ఇప్పుడు విశాఖకు వెళ్లమంటే ఏం చేయాలో దిక్కుతోచట్లేదు
  • రాజధాని తరలింపుపై ఉద్యోగ సంఘాల నాయకులూ స్పందించట్లేదు
  • విభజన తర్వాత ఇక్కడికి వచ్చేందుకే ఇబ్బంది పడ్డాం
రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై సిఫారసులు చేసిన జీఎన్ రావు, బీసీజీ కమిటీలు తమ అభిప్రాయాలను తీసుకోలేదని ఏపీ సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల, రాజధానిగా అమరావతే ఉంటుందని అనుకున్నామని మీడియాకు ఉద్యోగులు తెలిపారు. రాజధాని తరలించరని భావించి రుణాలు తీసుకుని ఇక్కడే ఫ్లాట్లు కొనుగోలు చేశామని, ఇప్పుడు విశాఖకు వెళ్లమంటే ఏం చేయాలో దిక్కుతోచడం లేదని అన్నారు. రాజధాని తరలింపు విషయమై ఉద్యోగ సంఘాల నాయకులు కూడా సరిగా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర పునర్విభజన తర్వాత హైదరాబాద్ నుంచి అమరావతి రావాలంటేనే ఇబ్బంది పడ్డామని గుర్తుచేసుకున్నారు.
Go Back to Shorts
Amaravati
secretariat
Hyderabad
Vizag

More Telugu News