Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారీ ర్యాలీతో పోలీస్ స్టేషన్ కు వెళ్లిన అయ్యన్నపాత్రుడు.. మరో కేసు బుక్ చేసిన పోలీసులు!

  • సోదరుడు సన్యాసినాయుడితో వివాదం
  • పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదు
  • తాజాగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని మరో కేసు
తన సోదరుడు సన్యాసినాయుడుతో జరిగిన వివాదంలో, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, పెట్టిన కేసులో కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్న మాజీ మంత్రి, టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు, బెయిల్ పత్రాలను పోలీసులకు ఇచ్చేందుకు ర్యాలీగా వెళ్లి, మరో కేసులో బుక్కయ్యారు.

నర్సీపట్నంలో భారీ ర్యాలీగా స్టేషన్ కు వెళ్లిన ఆయన, ర్యాలీ ముగింపులో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోపించిన పోలీసులు, పలు సెక్షన్ల కింద కేసును రిజిస్టర్ చేశారు. కోడిపందాలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో పాటు, అనుమతి లేకుండా ర్యాలీ, రోడ్ షో నిర్వహించారన్న అభియోగాలను నమోదు చేసిన పోలీసులు, ఐపీసీలోని 504, 189, 188, 341 సెక్షన్ల కింద కేసు పెట్టారు.

Ayyanna Patrudu
Sanyasinayudu
Police
Case
Bail

More Telugu News