వెంకన్న దర్శనం కోసం వేచి చూస్తున్న 70 వేల మంది!
- వైకుంఠ ఏకాదశి నాడు 84 వేల మందికి పైగా దర్శనం
- ద్వాదశి నాడు వేచి చూస్తున్న 70 వేల మంది
- 24 గంటల తరువాతే సాధారణ దర్శనం
నిన్న వీఐపీల దర్శనం తరువాత సామాన్య భక్తులను అనుమతించగా, దాదాపు 84,160 మంది భక్తులు వైకుంఠ ద్వారంలోకి ప్రవేశించారు. మరో 70 వేల మంది భక్తులు ఇంకా దర్శనం కోసం వేచి చూస్తున్న పరిస్థితి. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ. 3 కోట్లు వచ్చిందని, ఇకపై ఉచిత దర్శనానికి వచ్చే భక్తులకు 24 గంటల తరువాత మాత్రమే దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.