బుగ్గన నిరాధార ఆరోపణలు చేశారు.. పరువు నష్టం దావా వేస్తున్నా: బీజేపీ నేత రావెల
- రూ.10కోట్లకు పరువు నష్టం దావా వేస్తున్నా
- ఎస్సీ, ఎస్టీల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారు
- బుగ్గన బహిరంగ క్షమాపణ చెప్పాలి
తన నోటీస్ అందిన తర్వాత బుగ్గన బహిరంగ క్షమాపణ చెప్పాలని రావెల డిమాండ్ చేశారు. రాజధాని అమరావతిని తరలించేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని వ్యాఖ్యానించారు. రాజధానిలో తనకు భూములున్నాయని అధికార పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తాను అద్దె ఇంట్లో ఉంటున్నానంటూ.. కుటుంబ పోషణే కష్టతరంగా ఉంటే రాజధానిలో భూములు ఎలా కొంటానని ప్రశ్నించారు. దళిత నేతగా స్వయంకృషితో ఎదిగిన తనపై ఇలాంటి ఆరోపణలు చేయడం సబబు కాదన్నారు.