Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిజంగానే కల్యాణ్ రామ్ పేరు మర్చిపోయా: అనిల్ రావిపూడి

  • ప్రీరిలీజ్ వేడుకలో చాలా సంతోషంగా ఉన్నా
  • వ్యక్తిగతంగా, వృత్తి పరంగా చాలా ఎమోషనల్ గా ఉన్నా
  • కల్యాణ్ రామ్ పేరును మర్చిపోవడం ఉద్దేశ పూర్వకంగా చేసింది కాదు
మహేశ్ బాబు, విజయశాంతితో పాటు భారీ తారాగణంతో వస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ప్రీరిలీజ్ వేడుక నిన్న హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన అనిల్ రావిపూడి ప్రసంగిస్తూ, తన సినీ ప్రయాణం గురించి చెప్పుకొచ్చారు. అయితే, తన తొలి హీరో కల్యాణ్ రామ్ పేరును చెప్పడం మర్చిపోయారు. తాను చేసిన పొరపాటుకు ఈరోజు ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చారు.

తన తొలి హీరో కల్యాణ్ రామ్ పేరు చెప్పడం మర్చిపోయానని అనిల్ రావిపూడి ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా, వృత్తి పరంగా నిన్న చాలా ఎమోషనల్ గా ఉన్నానని చెప్పారు. ప్రీరిలీజ్ వేడుకలో చాలా సంతోషానికి లోనయ్యానని... దీంతో, తన తొలి హీరో, నిర్మాత కల్యాణ్ రామ్ పేరును చెప్పడం మర్చిపోయానని తెలిపారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని... నిజంగానే మర్చిపోయానని చెప్పారు. కల్యాణ్ రామ్ తాజా చిత్రం 'ఎంత మంచివాడవురా' ఘన విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని ఆకాంక్షించారు. 
Kalyan Ram
Anil Ravipudi
Tollywood
SarileruNeekevvaru Movie

More Telugu News