రూ. 80 దాటిన లీటరు పెట్రోలు ధర!

  • వరుసగా నాలుగో రోజూ పెరిగిన ధర
  • లీటర్ పెట్రోల్ పై 9 పైసల వడ్డన
  • 11 పైసలు పెరిగిన డీజిల్ ధర
దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు మరింతగా పెరిగాయి. అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న అనిశ్చితి, ఇరాన్, అమెరికాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడిన కారణంగా క్రూడాయిల్ ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరుసగా నాలుగో రోజున ధరలు పెంచుతూ, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. లీటర్ పెట్రోల్ పై 9 పైసలు, డీజిల్ పై 11 పైసల మేరకు ధరను పెంచుతున్నట్టు ఐఓసీ ప్రకటించింది.

మారిన ధరల తరువాత హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ. 80.12కు, డీజిల్ ధర రూ. 74.70కి పెరిగింది. గడచిన ఏడాది వ్యవధిలో పెట్రోల్ ధర రూ. 80ని దాటడం ఇదే తొలిసారి. ఇక దేశ రాజధాని న్యూడిల్లీలో పెట్రోలు ధర రూ. 75.54కు, డీజిల్ ధర రూ. 68.51కి చేరింది.
Go Back to Shorts
Petrol
Diesel
Price Hike
IOC

More Telugu News