పెళ్లి చేసుకోవాలంటూ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు వేధింపులు.. జైలుకెళ్లినా మారని బుద్ధి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెళ్లి చేసుకోవాలంటూ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు వేధింపులు.. జైలుకెళ్లినా మారని బుద్ధి!

  • గతంలో యువతిని వేధించినందుకు జైలుకు
  • తాజాగా కంపెనీ వద్దకు వెళ్లి మరీ వేధింపులు
  • కేసు నమోదు చేసిన పోలీసులు
తనను పెళ్లి చేసుకోవాలంటూ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను వేధిస్తున్న యువకుడిపై మరోమారు కేసు నమోదైంది. హైదరాబాద్, మాదాపూర్ పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని తిరుమలగిరి ప్రాంతానికి చెందిన ఓ యువతి గతంలో ట్రావెల్స్ కార్యాలయంలో పనిచేసేది. ఘట్‌కేసర్‌ కొండాపూర్ ప్రాంతానికి చెందిన అఖిల్ (30) అదే కార్యాలయంలో సూపర్‌వైజర్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం పెరగడంతో పెళ్లి చేసుకోవాలంటూ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.

అతడి వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న తిరుమలగిరి పోలీసులు అతడిని జైలుకు పంపారు. కాగా,  ఇటీవల ఆమె మాదాపూర్‌లోని ఓ ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చేరింది. జైలు నుంచి విడుదలైన అఖిల్ శనివారం సాయంత్రం మాదాపూర్‌లో యువతి పనిచేస్తున్న కంపెనీ వద్దకు వచ్చి మరోమారు ఆమెను వేధించాడు. దీంతో బాధిత యువతి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
madapur
woman
Police

More Telugu News