వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనానికి భారీగా తరలివస్తున్న భక్తులు
- రేపు వైకుంఠ ఏకాదశి
- అర్ధరాత్రి 2 గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శనం
- భక్తులతో నిండిపోయిన తాత్కాలిక షెడ్లు
భక్తుల తాకిడి కారణంగా టీటీడీ అధికారులు నారాయణగిరి ఉద్యానవనం, నాలుగు మాఢవీధుల్లో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశారు. తాత్కాలిక షెడ్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. అటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇప్పటికే నిండిపోయింది. తాత్కాలిక షెడ్లు కూడా నిండిపోవడంతో క్యూలైన్లను కల్యాణ వేదిక వైపు మళ్లిస్తున్నారు. వైకుంఠ దర్శనాల సందర్భంగా తిరుమల కొండపైనా, తిరుపతిలోనూ 3,500 మంది శ్రీవారి వలంటీర్లు, 1300 మంది స్కౌట్లు భక్తులకు సేవలందిస్తున్నారు. ఏకాదశి రోజున కనుమ మార్గంలో 24 గంటలూ రాకపోకలకు అధికారులు అనుమతి ఇచ్చారు.