Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దేశంలో నా కుటుంబానికి అన్నీ లభిస్తున్నాయి : బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్

  • నా జీవితానికి సంబంధించి అన్నీ ఇక్కడే దొరుకుతున్నాయి
  • తాజా రాజకీయాలపై నిర్దిష్ట అభిప్రాయం రూపొందించుకుంటున్నా
  • దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో సాగుతోంది
భారతదేశంలో నా కుటుంబం అన్ని విధాల ఆనందాన్ని పొందుతోందని బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ అన్నారు.
సైఫ్ తాజాగా ఓ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘ఈ దేశంలో ఉంటున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. నా కుటుంబానికి అన్నీ ఇక్కడ లభిస్తున్నాయి. పిల్లలకు విద్య, వైద్యం అందుబాటులో ఉన్నాయి. నాకు వృత్తి పరంగా ఉపాధి కూడా ఉంది. నా జీవితానికి సంబంధించి అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. ఇదే పరిస్థితి ఇక ముందు కొనసాగుతుందని ఆశిస్తున్నా’ అని సైఫ్ పేర్కొన్నారు.

దేశంలో సీఏఏ, ఎన్నార్సీలపై కొనసాగుతున్న ఆందోళనలనలపై మీ స్పందన ఏంటని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా సైఫ్ బదులిస్తూ.. దేశంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై ఇంకా ఓ అభిప్రాయాన్ని రూపొందించుకునే ప్రయత్నంలో ఉన్నానన్నారు. దీనిపై తాను మాట్లాడితే కొందరికి నచ్చుతుంది, ఇంకొందరికి నచ్చకపోవచ్చన్నారు. దేనిపైనైనా స్పందించడానికి లేదా స్పందించకుండా ఉండటానికి తనకు హక్కులున్నట్లు భావిస్తున్నాని చెప్పారు.   భారత్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు. రానున్న కాలంలో దేశం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధిని నమోదు చేస్తుందని పేర్కొన్నారు.
Bollywood
Saif Alikhan
interview
India
Movie

More Telugu News