మహేశ్, బన్నీ సినిమాల రిలీజ్ డేట్ పై ఉత్కంఠ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహేశ్, బన్నీ సినిమాల రిలీజ్ డేట్ పై ఉత్కంఠ

  • 'సరిలేరు నీకెవ్వరు'పై భారీ అంచనాలు 
  • 'అల వైకుంఠపురములో' నిర్మాతల ఆలోచన 
  • అభిమానుల్లో పెరుగుతున్న ఆసక్తి
మహేశ్ బాబు కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' సినిమా రూపొందింది. రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ రూపొందించిన 'అల వైకుంఠపురములో' సినిమాను జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నట్టు ముందుగానే ప్రకటించారు.

అయితే 'అల వైకుంఠపురములో' నిర్మాతలు తమ సినిమా విడుదల విషయంలో నిర్ణయాన్ని మార్చుకున్నారనీ, ఈ సినిమాను జనవరి 10వ తేదీనే విడుదల చేయాలనే ఆలోచన చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దాంతో 'సరిలేరు నీకెవ్వరు' నిర్మాతలు కూడా జనవరి 10వ తేదీనే తమ సినిమాను కూడా బరిలోకి దింపాలనే దిశగా ఆలోచన చేస్తున్నారని సమాచారం. ఈ రెండు సినిమాల విడుదల విషయంలో సందిగ్ధత ఏర్పడటంతో, అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
Mahesh Babu
Allu Arjun

More Telugu News