సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీలో వృద్ధ మహిళల నిరసన!
- ఎముకలు కొరికే చలిని తట్టుకుంటూ 15 రోజులుగా..
- ఢిల్లీలోని షహీన్ బాఘ్ ప్రాంతంలో ధర్నా
- పూర్తి పేర్లు చెబితే జాబితాలోంచి తొలగిస్తారన్న వృద్ధులు
వీరి నిరసనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల ఆదరణను విశేషంగా చూరగొంటోంది. సీఏఏపై దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సీఏఏపై వెనక్కి తగ్గేది లేదని పేర్కొంటోంది. తాజాగా బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి అమిత్ షా ఇదే విషయాన్ని మరోసారి తేల్చి చెప్పారు. ఈ చట్టం మైనారిటీలకు వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు.