Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టాలీవుడ్ హీరో సుధీర్ బాబు పోస్ట్ చేసిన ఫొటో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!

  • నన్ను నమ్మండి
  • ఇది ఫొటోషాప్ లో చేసిన ఫొటో కాదు
  • జస్ట్ ఏ జంప్
  • ట్విట్టర్ లో పేర్కొన్న హీరో సుధీర్ బాబు  
'నన్ను నమ్మండి.. ఇది ఫొటోషాప్ లో చేసిన ఫొటో కాదు.. జస్ట్ ఏ జంప్' అంటూ టాలీవుడ్ హీరో సుధీర్ బాబు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫొటో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఫొటోను ఎడిట్ చేయకపోతే గాల్లో అలా ఎలా తేలిపోయాడని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గాల్లో ఎగురుతూ సుధీర్ బాబు ఆసనాలు ప్రయత్నించినప్పుడు ఈ ఫొటో తీసినట్లు తెలుస్తోంది.
        ఈ ఫొటోలపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. స్టన్నింగ్ స్టార్ సుధీర్ బాబు అని అంటున్నారు. ప్ర‌స్తుతం ఆయన ఇంద్ర‌గంటి మోహ‌నకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో 'వి' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నాని కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అదితి రావు హైద‌రి, నివేదా థామ‌స్ ఇందులో హీరోయిన్లు.
Tollywood
Twitter

More Telugu News