బాగ్దాద్ విమానాశ్రయంపై రాకెట్ దాడి.. రెండు దేశాల ఉన్నతస్థాయి కమాండర్లు సహా 8 మంది మృతి
- రెండు రోజుల క్రితం అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్ మద్దతుదారుల దాడి
- ఇరాక్ చేరుకున్న అమెరికా అదనపు బలగాలు
- మృతుల్లో ఇరాన్ నిఘా విభాగాధిపతి ఖాసిం సొలీమని
ఇరాన్ మద్దతుదారులు కొందరు రెండు రోజుల క్రితం ఇరాక్‌లోని అమెరికా దౌత్య కార్యాలయంపై దాడిచేయడంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడిని తీవ్రంగా పరిగణించిన అమెరికా ఇరాక్‌కు అదనపు బలగాలను పంపించింది. ఆ వెంటనే ఈ దాడి జరగడం గమనార్హం.