ఇది సాహసోపేతమైన నిర్ణయం: సీడీఎస్ నియామకంపై ఎయిర్ ఫోర్స్ చీఫ్ కితాబు
- సీడీఎస్ ను నియమించడాన్ని స్వాగతిస్తున్నాం
- బిపిన్ రావత్ కు పూర్తి సహకారాన్ని అందిస్తాం
- సీడీఎస్ కు సహకరించడం త్రివిధ దళాల బాధ్యత
ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ మూడు విభాగాలు సంయుక్తంగా ముందుకు సాగేందుకు సీడీఎస్ ఉపయోగపడుతుందని చెప్పారు. భారత తొలి సీడీఎస్ గా రావత్ నిన్న బాధ్యతలను స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా త్రివిధ దళాల నుంచి ఆయన గౌరవ వందనాన్ని స్వీకరించారు. అంతకు ముందు సీడీఎస్ గా నియమితులైన రావత్ కు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు.