భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల!
- 18 కంపార్టుమెంట్లలో భక్తులు
- స్వామి దర్శనానికి 16 గంటల సమయం
- నిన్న రూ. 3.50 కోట్ల హుండీ ఆదాయం
దివ్య దర్శనం, ప్రత్యేక దర్శనం, టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన వారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న మంగళవారం నాడు స్వామిని 88,262 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,706 మంది తలనీలాలను సమర్పించారు. హుండీ ద్వారా రూ. 3.50 కోట్ల ఆదాయం లభించింది.