సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి: డిఎంకే చీఫ్ స్టాలిన్
- ప్రజలు రాజ్యాంగాన్ని రక్షించాలని కోరుకుంటున్నారు
- కేరళ అసెంబ్లీ తీర్మానాన్ని స్వాగతించిన స్టాలిన్
- తమిళనాట ఊపందుకున్న నిరసన ర్యాలీలు
సీఏఏ, ఎన్నార్సీలపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తమిళనాడులో కూడా నిరసన ర్యాలీలు జరుగుతున్నాయి. తమిళనాడులో సీఏఏ, ఎన్నార్సీలను వ్యతిరేకిస్తూ.. ప్రజలు భారీ ర్యాలీ చేపడుతున్నారు. ఈ ప్రదర్శనల్లో పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొంటున్నారు. ఇటీవల జరిపిన ర్యాలీల్లో స్టాలిన్ తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కూడా పాల్గొన్నారు.