నాగార్జున నా వెంటపడటంతో నేను పరుగులు తీశాను: ఖుష్బూ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాగార్జున నా వెంటపడటంతో నేను పరుగులు తీశాను: ఖుష్బూ

  • అప్పటికి నాకు తమిళం రాదు 
  •  అలా గుడ్ మార్నింగ్ చెప్పాలన్నారు 
  •  అది బ్యాడ్ వర్డ్ అని తెలియదన్న ఖుష్బూ
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఖుష్బూ మాట్లాడుతూ, 'కెప్టెన్ నాగార్జున' షూటింగు సమయంలో జరిగిన ఒక సరదా సంఘటనను గురించి ప్రస్తావించారు. "నాగార్జున హీరోగా 'కెప్టెన్ నాగార్జున' షూటింగ్ చెన్నై, ఏవీఎమ్ స్టూడియోలో జరిగింది. అప్పటికి నాకు తమిళ్ తెలియదు .. తెలుగు తెలియదు. డాన్స్ మాస్టర్ చిన్ని ప్రకాశ్ గారి అసిస్టెంట్ సతీశ్ గారు ఉండేవారు. చెన్నైలో షూటింగ్ జరుగుతుంది కనుక, తమిళంలోనే గుడ్ మార్నింగ్ చెప్పాలని అన్నారు.

తమిళభాషలో గుడ్ మార్నింగ్ ఇలా చెప్పాలని నాకు నేర్పించారు. ఆయన నాకు నేర్పించింది ఒక బ్యాడ్ వర్డ్ అని నాకు అప్పటికి తెలియదు. ఏవీఎమ్ స్టూడియోలో వేసిన బంగ్లా సెట్ పై నేను వున్నాను .. కింద నాగార్జునగారు వున్నారు. ఆయన కనిపించగానే చేయి ఊపుతూ సతీశ్ గారు తమిళంలో నేర్పించిన మాట చెప్పేశాను.

 అంతే.. సెట్లో వున్న వాళ్లందరితో పాటు నాగార్జున కూడా షాక్ అయ్యారు. నేను చెప్పింది గుడ్ మార్నింగ్ కాదనే విషయం నాకు అర్థమైంది. అంతే.. ఈలోగా నాగార్జునగారు పరిగెత్తుకుని పైకి రావడం చూసి, నేను మరో వైపు నుంచి క్రిందికి దిగేసి పరిగెత్తాను" అంటూ నవ్వేశారు.
Khushbu

More Telugu News