అలా అడగడంతో అమితాబ్ నన్ను కొడతానన్నారు: సీనియర్ హీరోయిన్ ఖుష్బూ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అలా అడగడంతో అమితాబ్ నన్ను కొడతానన్నారు: సీనియర్ హీరోయిన్ ఖుష్బూ

  • నేను పుట్టిపెరిగింది ముంబైలో 
  • చైల్డ్ ఆర్టిస్టుగా చాలా సినిమాలు చేశాను
  • 200పైగా సినిమాలు చేశానన్న ఖుష్బూ
తెలుగులో నిన్నటితరం అందమైన కథానాయికల జాబితాలో 'ఖుష్బూ' పేరు కూడా కనిపిస్తుంది. సీనియర్ స్టార్ హీరోల జోడీగా ఆమె ఆడిపాడింది .. ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ .. "నేను పుట్టి పెరిగింది ముంబైలో. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో కలుపుకుని మొత్తం 200 సినిమాలకి పైగా చేశాను.

ఊహతెలిసిన దగ్గర నుంచి అమితాబ్ అంటే నాకు చాలా ఇష్టం. బాల నటిగా అమితాబ్ సినిమాల్లో నటించాను. 'నసీబ్'.. 'దేశ్ ప్రేమి' .. 'కాళియా' .. 'లావారీస్' మొదలైన చిత్రాలు చైల్డ్ ఆర్టిస్ట్ గా నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆ తరువాత కొంతకాలానికి అమితాబ్ గారు కలిస్తే, ఆయనతో కలిసి ఒక డ్యూయెట్లో కనిపించాలని ఉందని చెప్పాను. అలాంటి కోరిక కోరితే, కొడతానంటూ చేయి చూపించారు. 'సెట్లో నా కూతురుతోపాటు నిన్ను చూసుకున్నాను. అందువలన నాతో నువ్వు డ్యూయెట్లు పాడాలనుకోకూడదు' అని అన్నారంటూ చెప్పుకొచ్చారు.
Khushbu
Ali

More Telugu News