ఆ విషయాన్ని నిరూపిస్తే వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి కాళ్లు మొక్కుతా: పంచుమర్తి అనురాధ
- మీ ఎన్నికే వివాదాస్పదం
- మీ గెలుపు కోసం కృషి చేసిన వ్యక్తి రైతుల పక్షాన నిలిచారు
- గ్రామ సచివాలయాలకు మీ వాళ్లే నల్లరంగు పూశారు
ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ గ్రామ సచివాలయాలకు మీ పార్టీవారే నల్లరంగు పూశారని... వారు కూడా పెయిడ్ ఆర్టిస్టులేనా? అని అనురాధ ప్రశ్నించారు. ఫిరంగిపురం గెస్ట్ హౌస్ లో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సాగించే అనైతిక కార్యకలాపాలు ప్రజలందరికీ తెలుసని అన్నారు. కరకట్ట భూ యజమానుల నుంచి, కాజ టోల్ గేట్ వద్ద ఓ రియలెస్టేట్ కంపెనీ నుంచి ఎంత వసూలు చేశారో బయటపెడతామని చెప్పారు.