అమెరికాలో బ్రెయిన్ డెడ్ అయిన చరితారెడ్డి కన్నుమూత!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెరికాలో బ్రెయిన్ డెడ్ అయిన చరితారెడ్డి కన్నుమూత!

  • డెల్లాయిట్ లో జాబ్ చేస్తున్న చరితారెడ్డి
  • వీకెండ్ లో స్నేహితులతో షికారుకు
  • రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్
అమెరికాలోని మిచిగాన్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన ఎల్లా చరితారెడ్డి, కన్నుమూసింది. శుక్రవారం ఈ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. చరితారెడ్డి మృతితో, హైదరాబాద్, నేరేడ్ మెట్ లోని ఆమె ఇంట్లో విషాదం నెలకొంది.

8 నెలల క్రితం తమ బిడ్డ డెలాయిట్ లో ఉద్యోగం రావడంతో అమెరికా వెళ్లిందని, హెచ్-1 వీసా రాకుంటే, తిరిగి వెనక్కు వచ్చేస్తానని తమతో చెప్పిందని, ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని చరితారెడ్డి తండ్రి ఇంద్రారెడ్డి కన్నీటిపర్యంతమయ్యారు. కాగా, వీకెండ్ సందర్భంగా ముగ్గురు స్నేహితులతో కలిసి చరితారెడ్డి వెళ్లగా, ఆగివున్న వారి కారును వెనుకనుంచి వచ్చిన మరో కారు బలంగా ఢీకొట్టగా, కారులో కూర్చున్న వారికి తీవ్రగాయాలు అయ్యాయి.

ప్రమాదానికి కారకుడైన వ్యక్తిని యూఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చరితారెడ్డి మృతదేహాన్ని హైదరాబాద్ కు తరలించేందుకు అక్కడి తెలుగు సంఘాల సహకారాన్ని తీసుకుంటున్నట్టు మృతురాలి సోదరుడు యశ్వంత్ రెడ్డి తెలిపారు. ఇంద్రారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి ఈటల రాజేందర్, కష్ట సమయంలో వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Charita Reddy
Michigan
USA
Died
Road Accident

More Telugu News