ప్రధాని మోదీ నివాసంలో స్వల్ప అగ్ని ప్రమాదం
- ఎస్పీజీ రెసెప్షన్ లో చోటుచేసుకున్న ప్రమాదం
- మంటలను ఆర్పివేసిన అగ్నిమాపక సిబ్బంది
- షార్ట్ సర్క్యూట్ కారణమన్న పీఎంవో
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 9 అగ్ని మాపక శకటాలతో అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) ఓ ప్రకటన చేసింది. స్వల్ప అగ్ని ప్రమాదమేనని తెలిపింది. ఎస్పీజీ రిసెప్షన్ లో ఈ ప్రమాదం జరిగిందని ట్విట్టర్ మాద్యమంగా వెల్లడించింది.