ఆందోళన తెలుపుతోన్న రాజధాని రైతులను కలవనున్న పవన్ కల్యాణ్
- రేపు ఉదయం 8 గంటల నుంచే పవన్ పర్యటన
- మందడం, వెలగపూడి, తుళ్లూరు గ్రామాల రైతులతో భేటీ
- రైతులతో నేరుగా మాట్లాడి ఇబ్బందులు తెలుసుకోనున్న పవన్
రేపు ఉదయం 8 గంటల నుంచే పవన్ కల్యాణ్ రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా మందడం, వెలగపూడి, తుళ్లూరు గ్రామాల రైతులతో ఆయన మాట్లాడతారు. ఇటీవల మందడంలో జనసేన నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబుతో పాటు పలువురు పర్యటించిన విషయం తెలిసిందే.