వరుణ్ తేజ్ హీరోగా భారీ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్న అల్లు బాబీ
- గతంలో నిర్మాణ పర్యవేక్షణ చేసిన అల్లు బాబీ
- ఇప్పుడు నిర్మాతగా రంగంలోకి
- భారీ బడ్జెట్ తో వరుణ్ తేజ్ తో మూవీ
ఇక ఇప్పుడు నిర్మాణ బాధ్యతను పూర్తిగా తనపైనే వేసుకున్నాడు. వరుణ్ తేజ్ హీరోగా ఒక సినిమాను రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. భారీ హాలీవుడ్ .. బాలీవుడ్ సినిమాలకి యాక్షన్ కొరియోగ్రఫీని అందించిన 'లార్నెల్ స్టోవెల్' ఈ సినిమాకి ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన దగ్గరే వరుణ్ తేజ్ శిక్షణ తీసుకుంటున్నాడు. భారీ బడ్జెట్ తో అల్లు బాబీ ఈ సినిమాను నిర్మించనున్నాడు.