భూమిని త్యాగం చేసిన రైతులకు మీరిచ్చే బహుమతి ఇదేనా జగన్ అన్నా?: కేశినేని నాని
- రాజధాని నిర్మాణం కోసం రైతులు త్యాగాలు చేశారు
- తమ ప్రాణంతో సమానంగా చూసుకునే భూములిచ్చారు
- హత్యా యత్నం కేసులు పెట్టి జైల్లో పెడతారా?
'రాజధాని నిర్మాణం కోసం తమ ప్రాణంతో సమానంగా చూసుకునే, తమకు తరతరాలుగా వారసత్వంగా సంక్రమించిన భూమిని త్యాగం చేసిన రైతులకు మీరిచ్చే బహుమతి హత్యా యత్నం కేసులు పెట్టి జైలులో పెట్టటమా జగన్ అన్నా?' అని ప్రశ్నిస్తూ కేశినేని నాని ట్వీట్ చేశారు. అరెస్టులకు సంబంధించి ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఆయన ఈ సందర్భంగా పోస్ట్ చేశారు.