పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన నటి సంజన, నిర్మాత వందన మధ్య గొడవ!

  • క్రిస్మస్ ముందు రోజు పబ్ లో పార్టీ
  • పరస్పరం గొడవపడి పోలీసులకు ఫిర్యాదు
  • హాట్ టాపిక్ గా మారిన గొడవ
దక్షిణాది నటి సంజనా గల్రాని, శాండల్ వుడ్ నిర్మాత వందనా జైన్‌ ల మధ్య క్రిస్మస్‌ ముందు రోజు, 24వ తేదీన బెంగళూరులోని ఓ ప్రముఖ పబ్ లో జరిగిన గొడవ ఇప్పుడు పోలీసు స్టేషన్ కు వెళ్లింది. వీరి రచ్చ ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయింది. సదరు పబ్‌ లో జరిగిన ఓ పార్టీకి హాజరైన వీరిద్దరూ పరస్పరం గొడవపడి, ఆపై ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ కు సంజన ఫిర్యాదు చేసింది. ఆపై మీడియాతో మాట్లాడుతూ, ఆమె అక్రమ దందాలు చేస్తోందని, అందుకు పొలిటికల్ లీడర్లను, క్రికెటర్లను వాడుకుంటోందని సంచలన ఆరోపణలు చేసింది.

ఇక సంజన ఆరోపణలపై వందనా జైన్ మాట్లాడుతూ, తనను ప్రశ్నించటానికి సంజన ఎవరిని ప్రశ్నించింది. తాగిన మైకంలో తనపై దాడి చేయడంతో పాటు అసత్య ఆరోపణలు చేస్తోందని మండిపడింది. సంజన సంగతి తనకు తెలుసునని, వాటిని బయటపెడితే, ఆమె రోడ్డున పడాల్సిందేనని వ్యాఖ్యానించింది. సంజన మందు బాటిల్‌ తో తనపై దాడి చేస్తుంటే ఎంతో మంది చూశారని చెప్పింది. సంజనపై తాను కబ్బన్‌ పార్క్‌ పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పింది.
Go Back to Shorts
Sanjana Gurlani
Vandana Jain
Police
Pub

More Telugu News