మేము తప్పు చేయలేదు.. సీబీఐతో కాకపోతే ఎఫ్బీఐతో విచారణ జరిపించుకోవచ్చు: విజయసాయిరెడ్డి

  • విశాఖలో ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారన్న చంద్రబాబు
  • అలాంటివి చంద్రబాబు వల్లే అవుతాయన్న విజయసాయిరెడ్డి
  • చంద్రబాబుది కుటిల స్వభావం అంటూ విమర్శ
విశాఖలో వైసీపీ నేతలు ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఆరోపణలపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. తాము ఎలాంటి తప్పులు చేయలేదని... సీబీఐతో కాకపోతే ఎఫ్బీఐతో విచారణ జరిపించుకోవచ్చని అన్నారు.

చంద్రబాబు ఒక కుటిల స్వభావం కలిగిన వ్యక్తి అని విమర్శించారు. తన కుటుంబసభ్యులను తప్ప ప్రపంచంలో మరెవరినీ నమ్మరని అన్నారు. చంద్రబాబు స్వార్థపరుడని... తన సొంత కుటుంబం మాత్రమే సంతోషంగా ఉండాలని అనుకుంటారని విమర్శించారు. కుటిల రాజకీయాలు, ఇన్సైడర్ ట్రేడింగులు చంద్రబాబు వల్లే అవుతాయి కానీ మరెవరి వల్ల కావని అన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖలు చేశారు.
Go Back to Shorts
Chandrababu
Vijayasai Reddy
Telugudesam
YSRCP

More Telugu News