హీరోగా ఎంట్రీ ఇస్తున్న విలన్ తనయుడు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హీరోగా ఎంట్రీ ఇస్తున్న విలన్ తనయుడు

  • విలన్ గా రాణించిన సత్యప్రకాశ్ 
  • హీరోగా నటరాజ్ పరిచయం 
  • త్వరలో విడుదలకానున్న 'ఊల్లాల ఊల్లాల'
తెలుగు తెరపై ప్రతినాయక పాత్రల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సత్యప్రకాశ్ ఒకరిగా కనిపిస్తాడు. కన్నడ నటుడిగా ఆయనకి అక్కడ క్రేజ్ వుంది. కన్నడలో వరుస సినిమాలు చేస్తున్న ఆయన, తెలుగులో వచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకుంటూ వెళుతున్నాడు. ఇటీవల మెగాఫోన్ చేతబట్టి ఆయన దర్శకుడిగా మారిపోయాడు.

ఈ సినిమాను గురించి సత్యప్రకాశ్ మాట్లాడుతూ .. "మా అబ్బాయి పేరు నటరాజ్ .. 'మనసు మల్లిగా' అనే చిత్రం ద్వారా కన్నడ పరిశ్రమకి పరిచయమయ్యాడు. తెలుగు తెరకి 'ఊల్లాల ఊల్లాల' అనే సినిమా ద్వారా పరిచయం కానున్నాడు. ఈ సినిమాకి నేనే దర్శకుడిగా వ్యవహరించాను. సినిమా పిచ్చి వున్న ఓ కుర్రాడు, అందుకు అవసరమైన డబ్బుకోసం ఏం చేశాడనేదే కథ. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది" అని చెప్పుకొచ్చాడు.
Sathya Prakash
Nataraj

More Telugu News