భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పాక్ క్రికెటర్ మియాందాద్.. ఐసీసీకి మతిలేని సూచన!
- విదేశీ జట్ల పర్యటనకు భారత్ అంత సురక్షితం కాదు
- భారత ప్రజలు వారిలో వారే పోట్లాడుకుంటారు
- ఐసీసీ ఈ విషయాన్ని ప్రకటించాలి
విదేశీ జట్లు భారత్‌లో పర్యటించకుండా అడ్డుకోవాలన్నదే తన డిమాండ్ అని, ఇదే విషయాన్ని ఐసీసీకి విజ్ఞప్తి చేస్తున్నట్టు మియాందాద్ తెలిపాడు. తన సూచనపై ఐసీసీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉందన్నాడు. ఇప్పుడు ఐసీసీ ఏం చేస్తుందో, ప్రపంచానికి ఏమని చెబుతుందో చూడాలని ఉందంటూ మియాందాద్ చేసిన వ్యాఖ్యలపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. కాగా, పాక్ క్రికెటర్లు భారత్‌పై విద్వేష వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. సమయం, సందర్భం లేకుండా భారత్‌పై విషం కక్కుతుండడం పరిపాటిగా మారింది.