సిద్ధిపేటలో దారుణం.. ఎనిమిదో తరగతి బాలికతో ఏడాదిగా పూజారి ప్రేమాయణం.. లైంగిక దాడి
- ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అఘాయిత్యం
- సన్నిహితంగా గడిపి ఫొటోలు
- వాట్సప్ గ్రూపుల్లో వైరల్ చేసిన పూజారి
చివరకు పూజారి మహేందర్ (23)ను పోలీసులు అరెస్టు చేశారు. అతడు ఆ బాలిక ఫొటోలను వాట్సప్ గ్రూపుల్లో వైరల్ చేశాడని పోలీసులు గుర్తించారు. వాటిని చూసిన ఆ బాలిక తల్లిదండ్రులు తమకు ఫిర్యాదు చేశారని చెప్పారు. అతడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధిత బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించి, ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.