పాక్ క్రికెటర్ పరిస్థితే ఇంత ఘోరంగా ఉంది.. సాధారణ హిందువుల పరిస్థితి ఇంకెలా ఉంటుంది?: బీజేపీ ఎంపీ అరవింద్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాక్ క్రికెటర్ పరిస్థితే ఇంత ఘోరంగా ఉంది.. సాధారణ హిందువుల పరిస్థితి ఇంకెలా ఉంటుంది?: బీజేపీ ఎంపీ అరవింద్

  • డానిష్‌ కనేరియా హిందువు కావడంతో అప్పటి జట్టులో వివక్ష 
  • విషయాన్ని వెల్లడించిన షోయబ్ అక్తర్
  • ఒవైసీతో పాటు టీఆర్ఎస్ పార్టీపై అరవింద్ విమర్శలు 
పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్ డానిష్‌ కనేరియా హిందువు కావడంతో అప్పటి జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఆయనపై వివక్ష చూపారని మాజీ క్రికెటర్ షోయబ్‌ అక్తర్‌ తాజాగా తెలిపాడు. డానిష్ తో కలిసి భోజనం కూడా చేసే వాళ్లు కాదని తెలిపాడు. దీనిపై బీజేపీ ఎంపీ డి.అరవింద్ స్పందిస్తూ ఏఐఎంఐఎం అధినేత ఒవైసీతో పాటు టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.

పాక్ తరఫున ఆడే ఒక క్రికెట్ ప్లేయర్ దుస్థితి ఇలా ఉంటే.. సాధారణ హిందువుల పరిస్థితి ఎలా ఉంటుంది ఆ దేశంలో? అని ఆయన ప్రశ్నించారు. మరి అలాంటి వారికి పౌరసత్వం ఇచ్చే చట్టాన్ని సర్వ శక్తులు ఒడ్డి వ్యతిరేకిస్తున్న ఒవైసీ-తెరాస ధ్వయానికి ఇవన్నీ కనిపించడం లేదా? అంటూ ట్వీట్ చేశారు.
Pakistan
BJP
caa

More Telugu News