ప్రభుత్వ ఆఫీసు ఉంటేనే అభివృద్ధి చెందుతుందని భావించడం ఒక అపోహ: 'జనసేన' లక్ష్మీనారాయణ
- మూడు రాజధానులు అంశంపై లక్ష్మీనారాయణ స్పందన
- అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని హితవు
- ప్రజలు కోరుకుంటున్న పాలన ఇవ్వాలని సూచన
ప్రభుత్వ ఆఫీసులు ఏర్పాటు చేస్తే అభివృద్ధి చెందుతుంది అనుకుంటే, ప్రతి జిల్లాలోనూ ప్రభుత్వ ఆఫీసు ఏర్పాటు చేస్తే ఎంతో అభివృద్ధి సాధించేవాళ్లం కదా అని లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందాల్సింది ప్రభుత్వం కాదని, పరిపాలన అభివృద్ధి చెందాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎక్కువగా కనిపించాలన్న పాత పంథాను వదిలేయాలని, ప్రజలు కోరుకుంటున్న పాలనపై దృష్టిపెట్టాలని హితవు పలికారు.