మా పెళ్లిని రద్దు చేసుకోవడానికి కారణం ఇదే: రష్మిక 
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మా పెళ్లిని రద్దు చేసుకోవడానికి కారణం ఇదే: రష్మిక 

  • రక్షిత్ పై ప్రేమ పుట్టిన కారణంగానే పెళ్లి చేసుకోవాలనుకున్నా
  • సినిమాల కోసం రెండేళ్ల పాటు పెళ్లిన వాయిదా వేసుకున్నాం
  • అవకాశాలు పెరగడంతో పెళ్లిని రద్దు చేసుకున్నాం
కన్నడ భామ రష్మిక మందన్న వరుస సినిమాలతో టాలీవుడ్ లో దూసుకుపోతోంది. 'గీత గోవిందం' సినిమా హిట్ అయిన తర్వాత... ఆమె స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. మరోవైపు, ఆమె స్టార్ కాకముందు... కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. వారి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. అయితే, చివరకు పెళ్లి చేసుకోకుండానే వారిద్దరూ విడిపోయారు.

దీనిపై రష్మిక మరోసారి క్లారిటీ ఇచ్చింది. రక్షిత్ పై ప్రేమ పుట్టిన కారణంగానే పెళ్లి చేసుకోవాలనుకున్నానని ఆమె తెలిపింది. అయితే, సినిమాల్లో మంచి పేరు తెచ్చుకోవాలనే కారణంతో పెళ్లిని రెండేళ్లు వాయిదా వేసుకోవాలని అనుకున్నామని, రెండేళ్లు గడిచిన తర్వాత... సినిమా అవకాశాలు అధికం కావడంతో.. పెళ్లికి సమయం కేటాయించడం సాధ్యం కాలేదని తెలిపింది. పెళ్లి చేసుకుంటే నిర్మాతలను ఇబ్బంది పెట్టినట్టవుతుందని తను భావించానని చెప్పింది. ఈ కారణంగానే తమ పెళ్లిని రద్దు చేసుకున్నట్టు తెలిపింది.
Rashmika
Tollywood
Marriage

More Telugu News