ప్రియుడ్ని అప్పగించాలంటూ.. పోలీస్ స్టేషన్‌లో యువతి వీరంగం

  • బాచుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఘటన
  • ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపు
  • గతంలోనూ ఇలాగే చేసిందన్న పోలీసులు
తన  ప్రియుడిని తీసుకొచ్చి అప్పగించాలంటూ ఓ యువతి పోలీస్ స్టేషన్‌లో వీరంగం సృష్టించింది. హైదరాబాద్ శివారు బాచుపల్లి పోలీస్ స్టేషన్‌లో జరిగిందీ ఘటన. యువతిని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిత్రపురి కాలనీకి చెందిన యువతిగా గుర్తించారు. తన ప్రియుడిని తీసుకొచ్చి అప్పగించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వినిపించుకోకపోవడంతో షీటీమ్స్‌ను పిలిపించి కౌన్సెలింగ్ ఇప్పించారు.

బాచుపల్లి యువకుడితో తనకు పరిచయం ఉందని, అతడిని తీసుకొచ్చి ఇవ్వాలని యువతి డిమాండ్ చేసింది. అయితే, అక్కడ యువకుడు లేడని, ఫిర్యాదు చేస్తే వెతికిపెడతామంటే ఒప్పుకోవడం లేదని పోలీసులు తెలిపారు. యువతి గతంలోనూ ఇలానే ప్రవర్తించిందని, రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో హల్‌చల్ చేసిందని అయితే, ఫిర్యాదు మాత్రం చేయలేదని పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
Hyderabad
girl
Police
lover

More Telugu News