రాజధాని తరలింపుపై క్లారిటీ లేదు: వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు
- అమరావతి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
- రైతులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది
- రాజధాని అంశం కేబినెట్ ఆమోదం పొందాల్సి ఉంది
రాజధాని తరలింపుపై ఇంకా క్లారిటీ రాలేదని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఈ అంశం ఇంకా కేబినెట్ ఆమోదం పొందాల్సి ఉందని చెప్పారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేదే ముఖ్యమంత్రి జగన్ ఆలోచన అని అన్నారు.