రెండేళ్ల క్రితం నా భర్తను చంపేశా... ఏకంగా హోమ్ మంత్రికే చెప్పిన యువతి!

  • నన్ను శిక్షించండి
  • జనతా దర్బార్ లో మంత్రి అనిల్ విజ్ కు విన్నపం 
  • పోలీసులకు అప్పగించిన మంత్రి
తన భర్తను రెండేళ్ల క్రితమే హత్య చేశానని చెబుతూ, ఓ వివాహిత, హర్యానా హోమ్ శాఖ మంత్రి అనిల్ విజ్ కు కన్నీటితో ఓ లేఖను అందించడం తీవ్ర కలకలం రేపింది. తన నేరానికి శిక్షను విధించాలని ఆమె కోరింది.

అంబాలాలో జనతా దర్బార్ జరుగగా, అనిల్ విజ్ హాజరయ్యారు. కన్నీరు పెడుతూ తన వద్దకు వచ్చిన ఆమెను చూసి వివరాలు అడిగారు. ఆమె చెప్పిన మాట విని తొలుత దిగ్భ్రాంతికి గురైన అనిల్ విజ్, ఆపై పోలీసులను పిలిపించి, ఆమెను అప్పగించారు.

తానే స్వయంగా భర్తను హత్య చేశానని ఆమె లిఖిత పూర్వకంగా రాసివ్వడంతో, హత్య కేసు నమోదు చేశామని, ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందన్న విషయమై దర్యాఫ్తును ప్రారంభించామని తెలిపారు. 
Go Back to Shorts
Haryana
Husbend
Murder
Lady
Anil Viz

More Telugu News