Baba Ramdas: అమెరికన్ ఆధ్యాత్మిక గురువు బాబా రాందాస్ కన్నుమూత

షార్ట్స్‌లో చూడండి
అమెరికాకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, మేధావి, మనోధర్మ నిపుణుడు అయిన బాబా రాందాస్ అలియాస్ రిచర్డ్ ఆల్బర్ట్ (88) కన్నుమూశారు. స్టీవ్ జాబ్స్ వంటి వారిలో స్ఫూర్తి రగిలించిన బాబా రాందాస్ గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆరు దశాబ్దాల క్రితం భారత్‌ కు వచ్చి వెళ్లాక రిచర్డ్స్ జీవిత దృక్పథాన్ని పూర్తిగా మార్చుకున్నారు. ఆధ్యాత్మిక రంగంలో కొత్త దారులు అన్వేషించారు. లిథర్జిక్‌ యాసిడ్‌ డైఇథైల్‌మైడ్‌ వాడకంతో దీర్ఘకాల వ్యాధులను నయం చేసేందుకు, వృద్ధాప్య సమస్యలను పరిష్కరించేందుకు ప్రయోగాలు చేశారు.
బాబా రాందాస్ మృతి వార్తను ఆయన నిర్వహించిన ఫౌండేషన్ ధ్రువీకరించింది.
Go Back to Shorts
Baba Ramdas
Spiritual guru
Died

More Telugu News