ప్రకాశం జిల్లాలో రాజధాని ఏర్పాటు చేసుంటే ప్రాంతాల మధ్య సమతౌల్యం వచ్చేది: మంద కృష్ణ
- ఏపీ రాజధానిపై మంద కృష్ణ వ్యాఖ్యలు
- సీఎం తన ప్రతిపాదన విరమించుకోవాలని హితవు
- రాజధాని విషయంలో గందరగోళం ఏర్పడిందన్న ఎమ్మార్పీఎస్ నేత
జీఎన్ రావు కమిటీ కంటే ముందే జగన్ రాజధానులపై మాట్లాడడం, చివరికి జీఎన్ రావు కమిటీ నివేదికలోనూ అవే అంశాలుండడం చూస్తుంటే జగన్ తాను కోరుకున్న నివేదికనే తెప్పించుకున్నట్టు భావించాల్సి వస్తోందని అన్నారు. జగన్ ఇప్పటికైనా తన ప్రతిపాదన విరమించుకుంటే రాష్ట్రానికి మేలు చేసినవారవుతారని మంద కృష్ణ హితవు పలికారు.