రష్మిక గతంలో ఎలా ఉండేదో తెలుసు: కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ ప్రియుడు రక్షిత్!
- రష్మిక కలలు చాలా పెద్దవి
- ఆమె కలలు నిజం కావాలి
- మీడియాతో రక్షిత్ శెట్టి
ఆమె గతంలో ఎలా ఉండేదో తనకు తెలుసునని, కాబట్టి ఆ కలలు కూడా ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసునని అన్నాడు. ఆమె కన్న కలలు నిజం కావాలని మాత్రం కోరుకుంటున్నానని వ్యాఖ్యానించాడు. గతంలో 'కిరిక్ పార్టీ'లో రక్షిత్, రష్మిక కలిసి నటించగా, వీరిద్దరి మధ్యా ప్రేమ చిగురించిన సంగతి తెలిసిందే. ఆపై నిశ్చితార్థం కూడా వైభవంగా జరిగింది. 2018లో వీరిద్దరూ విడిపోయారు. రష్మిక వరుస విజయాలతో ప్రముఖ హీరోయిన్ గా ఎదిగింది.