ఇటువంటి పిచ్చి ఆలోచనతో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది: కన్నా లక్ష్మీనారాయణ

  • జీఎన్ రావు కమిటీకి శాస్త్ర్రీయత ఏముంది?
  • ప్రభుత్వ ఆలోచన మేరకు ఈ కమిటీ రాసుకొచ్చింది
  • రాష్ట్రానికి సీఎం మారితే రాజధాని మారుతుందా?
ఏపీ రాజధానిపై నియమించిన జీఎన్ రావు కమిటీ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, జీఎన్ రావు కమిటీకి శాస్త్ర్రీయత ఏముంది? అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆలోచన మేరకు ఈ కమిటీ రాసుకొచ్చిందని విమర్శించారు.

పరిపాలనా వికేంద్రీకరణ చేయాలన్న సీఎం జగన్ ఆలోచన ఈ రాష్ట్రాభివృద్ధికి విఘాతం కల్గిస్తుందని అన్నారు.
రాష్ట్రానికి ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధాని మారుతుందన్న విషయం అభివృద్ధికి గొడ్డలిపెట్టులాంటిదని అన్నారు. ఇటువంటి పిచ్చి ఆలోచనతో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందే తప్ప ముందుకుపోదని అభిప్రాయపడ్డారు.
Go Back to Shorts
Amaravathi
cm
Jagan
BJP
kanna

More Telugu News