30 ఏళ్ల కిందట రాసిన పుస్తకం విషయంలో శశిథరూర్ పై అరెస్ట్ వారెంట్
- ది గ్రేట్ ఇండియన్ నావెల్ పుస్తకం రాసిన థరూర్
- నాయర్ వర్గ మహిళలను కించపరిచాడంటూ ఫిర్యాదు
- శనివారం విచారణ
- నోటీసుల్లో తేదీ పేర్కొనలేదన్న థరూర్ కార్యాలయం
దీనిపై శశి థరూర్ కార్యాలయ వర్గాలు స్పందించాయి. విచారణకు రావాలంటూ పంపిన నోటీసుల్లో కేవలం సమయం ఇచ్చారే తప్ప, తేదీ పొందుపరచలేదని తెలిపాయి. ఇదే విషయం కోర్టుకు తెలిపితే తాజాగా తేదీతో సహా మళ్లీ సమన్లు పంపిస్తామని తెలిపిందని, అయితే తమకు ఇప్పటివరకు ఎలాంటి సమన్లు అందలేదని థరూర్ కార్యాలయం పేర్కొంది. దీనిపై తిరువనంతపురం చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ను సంప్రదిస్తామని వెల్లడించింది.