సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డులు... అవార్డులు పొందిన తెలుగు చిత్రాలు, నటీనటుల వివరాలివి!

  • ఉత్తమ నటిగా కీర్తి సురేశ్, నటుడిగా రామ్ చరణ్
  • పలు అవార్డులు కొల్లగొట్టిన రంగస్థలం, మహానటి
  • చెన్నైలో వైభవంగా జరిగిన అవార్డుల కార్యక్రమం
సౌత్ ఫిల్మ్ ఫేర్ 66వ అవార్డుల కార్యక్రమం చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో వైభవంగా జరిగింది. 2018 సంవత్సరంలో విడుదలైన దక్షిణాది చిత్రాల నుంచి అవార్డు విజేతలను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ పరిశ్రమల నుంచి పలువురు నటీనటులు హాజరయ్యారు. ఇక తెలుగులో అవార్డులను పొందిన చిత్రాల జాబితాను పరిశీలిస్తే...

ఉత్తమ చిత్రంగా మహానటి ఎంపికైంది. ఉత్తమ దర్శకుడిగా అదే సినిమాకు పనిచేసిన నాగ్‌ అశ్విన్, ఉత్తమ నటుడిగా రామ్‌ చరణ్‌ (రంగస్థలం), ఉత్తమ నటిగా కీర్తి సురేశ్‌ (మహానటి), ఉత్తమ నటుడు (క్రిటిక్స్ విభాగం)గా దుల్కర్‌ సల్మాన్‌ (మహానటి), ఉత్తమ నటి (క్రిటిక్స్ విభాగం)గా రష్మిక మందన్న (గీతా గోవిందం), ఉత్తమ సహాయ నటిగా అససూయ భరద్వాజ్‌ (రంగస్థలం), ఉత్తమ సహాయ నటుడిగా జగపతిబాబు (అరవింద సమేత వీరరాఘవ), ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా రత్నవేలు (రంగస్థలం) అవార్డులను అందుకున్నారు.

వీరితో పాటు ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవీ శ్రీ ప్రసాద్‌ (రంగస్థలం), ఉత్తమ గేయ రచయితగా చంద్రబోస్‌ (ఎంత సక్కగున్నావే - రంగస్థలం), ఉత్తమ నేపథ్య గాయకుడిగా సిద్ శ్రీరామ్ (ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే - గీత గోవిందం), ఉత్తమ నేపథ్య గాయనిగా శ్రేయా ఘోషాల్‌ (మందరా మందరా - భాగమతి) ఎంపికయ్యారు.
Go Back to Shorts
Chennai
South Filmfare
Awards
Mahanati
Rangasthalam

More Telugu News