డ్రైవర్ల కొరత ఉంది.. డ్రైవర్ లెస్ కార్లను అనుమతించం: కేంద్రమంతి గడ్కరీ
- ఉద్యోగాలు తగ్గించే సాంకేతిక పరిజ్ఞానాన్నికేంద్రం స్వాగతించదు
- నేను రవాణామంత్రిగా ఉన్నంతకాలం అనుమతించను
- క్యాబ్ కంపెనీలు డ్రెవర్ లెస్ కార్లను తీసుకొస్తే డ్రైవర్లు నిరుద్యోగులవుతారు
దేశంలో ఉద్యోగ కల్పనను ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. క్యాబ్ సేవలందిస్తున్న ఓలా, ఉబెర్ వంటి సంస్థల్లో చాలామంది డ్రైవర్లుగా పనిచేస్తూ జీవిస్తున్నారని మంత్రి చెప్పుకొచ్చారు. ఒకవేళ ఈ క్యాబ్ కంపెనీలు డ్రెవర్ లెస్ కార్లను తీసుకొస్తే.. అప్పటికే ఉపాధి పొందుతున్న డ్రైవర్లంతా నిరుద్యోగులుగా మారతారని చెప్పారు. ఈ నేపథ్యంలో తమ ప్రభుత్వం డ్రైవర్ లెస్ కార్లను ప్రోత్సహించదని పేర్కొన్నారు.