ఉత్తరాంధ్ర అభివృద్ధికే విశాఖను పాలన రాజధానిగా ప్రకటించారు: విజయసాయిరెడ్డి
- ముంబై తరహాలో విశాఖ అభివృద్ధి చెందుతుంది
- విశాఖకు జగన్ జన్మదిన కానుక ఇది
- ఆరు నెలల్లోనే జగన్ విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు
ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. విశాఖకు జగన్ జన్మదిన కానుక ఇది అని ఆయన పేర్కొన్నారు. విశాఖ కేంద్రంగా పరిపాలన సాగుతుందని.. పదేళ్లలో ముంబై తరహాలో విశాఖ అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే జగన్ విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారని ప్రశంసించారు.